‘హే రోజా! ఊరుకో…వాడిని గారు అంటావేంటి?:చిరంజీవి

దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి

మెగాస్టార్ చిరంజీవికి, సినీ నటి రోజా సడన్ సర్ ప్రైజ్ చ్చింది. చిరు తన ప్రతిష్ఠాత్మక ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ యావత్ తెలుగు ప్రజలను ఊపేసే పనిలో తెగ తలమునకలయ్యారు. ఈ నేపథ్యంలోనే సాక్షి టీవీ చిరంజీవిని ఇంటర్వ్యూ చేసింది. ఇంటర్వ్యూ షూట్ కోసం

కెమెరామెన్ అంతా సెట్ చేసిన తరువాత మేడ పైనుంచి కిందికి దిగిన చిరంజీవి తనను ఇంటర్వ్యూ చేసేది ఎవరు? అని అడిగారు. ఇంతలో రోజా తానేనంటూ ముందుకు వచ్చింది. అంతే.. చిరంజీవి ఆశ్చర్యపోయారు. ‘సర్ ప్రైజ్ ఇద్దామని ఇలా వచ్చా’ అంటూ రోజా చెప్పడంతో ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అయితే ఈ ఇంటర్వ్యూలోని రోజా వేసిన ఓ ప్రశ్నకు చిరు ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ అయింది.

మీ ఇంట్లో అందరూ హీరోలైపోయారు కదా? ప్రధానంగా బంగారు కోడిపెట్ట పాటను రామ్ చరణ్ గారు చేస్తున్నప్పుడు మీరెలా ఫీలయ్యారు?’ అంటూ రోజా ప్రశ్నించింది. మెగాస్టార్ తక్షణ స్పందన ఏంటో తెలుసా?… ‘హే రోజా! ఊరుకో…వాడిని గారు అంటావేంటి?’ అని ఠక్కున బదులిచ్చారు. ‘పిల్లాడిగా వున్నప్పుడు వాడిని ఎత్తుకున్నావు… చరణ్ అను చాలు’ అని రోజాతో తమ కుటుంబానికి ఉన్న దగ్గరితనాన్ని చెప్పకనే చెప్పేశారు.

‘బంగారు కోడిపెట్ట.. వాడు రీమేక్ చేసినప్పుడు కొంచం ఫీల్ అయ్యా, అద్భుతంగా చేశాడని, దానిని చూసిన తర్వాత చాలా గర్వపడ్డా’ అన్నారు. అంతేకాదు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం కూడా చిరు చెప్పేశారు.. ఎవరు బాగా చేశారని సురేఖను అడిగితే… ‘ఇంకెవరు నా కొడుకే’ అంటూ మురిసిపోయిందని చిరంజీవి వెల్లడించారు. మొత్తానికి బాస్ ఈజ్ బ్యాక్.. చిరంజీవి జీవితానికి సంబంధించి ఇప్పటి వరకు తెలుగు ప్రజలకు తెలియని ఎన్నో వ్యక్తిగత విషయాలను కూడా తెలియచెప్పిందండీ…

దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి