భార్య భర్తని పేరు పెట్టి పిలవచ్చా? అసలు శాస్త్రాల ప్రకారం ఏముంది?

దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి

మునుపటి కాలంలో అయితే.. ఏవండి…మీరూ….అల్లుడు గారు ఇలా భార్య, భార్య తరుపువారు.. భర్త/అల్లుణ్ణి సంభోదించడం తెలిసిందే. కాని ఈ రోజుల్లో ఆడపిల్లలు, వారింటి తరుపువారు వారిని పేర్లతో పిలవడం పరిపాటి అయ్యింది. మనం ఆచరించిన ధర్మాలు, పురాణాలు, ఇతిహాసాల ప్రకారం భర్తను, అల్లుడిని

గౌరవంగా, మర్యాద పూర్వకంగా పలకరించడం వారికీ తగిన మర్యాద చెయ్యడం హిందూ సంప్రదాయం. పేరు పెట్టి పిలవడాన్ని విన్న వారేమో అలా పిలవకూడదని హితబోధ చేస్తుంటారు. దీనికి ఆడవాళ్లు తమను తాము సమర్థించుకునేందుకు “నాకు ఆయనంటే ఇష్టం కనుక పేరు పెట్టి పిలుస్తాను” అని చెబుతుంటారట. ఇంకా భార్య తరుపు వారు కూడా “నా కొడుకు అయినా, అల్లుడైనా అతనే కాబ్బట్టే పేరు పెట్టి పిలవడం లో తప్పు లేదు” అని వారి భావనట. అయితే సంప్రదాయాలు పాటించే వారు మాత్రం అలా చేయకూడదని ధర్మశాస్త్రాలు ప్రభోదిస్తున్నాయి.

ఆడవాళ్లు తమ భర్తను అలా పేరుపెట్టి పిలవడం వల్ల.. తన భర్త మీద ఉండవలసిన గౌరవం, మర్యాద రెండూ ఎదుటివారికి ఉండవు సరి కదా ఒక్కింత అతను పలచన అవుతారట. అంతే కాకుండా ఆడవాళ్లు అపహాస్యం పాలు అవుతారట.. అని ధర్మ శాస్త్రాలు ఒక్కాణిస్తున్నాయి. ఉదాహరణకు శ్రీరాముడు సీతను జనకరాజపుత్రీ అని కూడా పిలుస్తాడు. అలాగే భార్య కూడా పిలవొచ్చునట.

సీతాదేవి శ్రీరాముడ్ని ఎన్నోసార్లు పేరు పెట్టి పిల్చింది. అది ఏకాంతంలోనే.. భర్తను పేరు పెట్టి పిలవడం హిందూ సంప్రదాయం కాదట. వినే వారికి ఆ భర్తపై ఉండాల్సిన గౌరవం ఉండదు. అలాగే సాటి స్త్రీలల్లో కూడా ఆ స్త్రీ ఒకింత పలచనే అవుతుందట.

కాని చివరకి ఉండాల్సింది ప్రేమ ఆప్యాయత మరియు ఒకరి మిద ఒకరికి నమ్మకం పేరులో ఏముంది? పులుపు లో ఏముంది? అంతే కదా!

దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి