అపర ప్రజ్ఞాశాలి ఒక స్నేహం మరియు స్నేహితుడి గురించిన జీవిత రహస్యం ఏమి చెప్పాడో తెలుసా?

దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి

అపర ప్రజ్ఞాశాలి అయిన చాణక్యుడి వద్దకు ఓసారి ఓ మిత్రుడు వచ్చి నీకు ఈ విషయం తెలిసిందా.. నీ మిత్రుడి గురించి ఓ విషయం విన్నాను.. అంటూ ఎంతో కుతూహలంతో ఓ గాలి కబురు చెప్ప ప్రయత్నిస్తాడు. అదే సామాన్యుడైతే అన్ని పనులు పక్కనబెట్టి మరీ చెవులు రిక్కించి మరీ వింటాడు. కాని అక్కడ ఉన్నది

అపర చాణక్యుడాయే.. అందుకే ఏదో చెప్పబోతున్న వ్యక్తిని చాణక్యుడు ఆపి ‘నీవు నా మిత్రుడి గురించి చెప్పబోయే ముందు ఒక్క నిమిషం నీవు చెప్పబోయే విషయాన్ని కొద్దిగా జల్లెడ పడదాం.. అంటాడు. దీన్నే తాను ‘మూడు జల్లెళ్ల పరీక్ష’ అంటాను అని మొదలు పెట్టాడు..

మొదటి జల్లెడ: ‘నిజం’ నీవు నా స్నేహితుడి గురించి చెప్పబోయే విషయం ఖచ్చితంగా నిజమైనదని నీకు తెలుసా? అని అనిగాడు.
అందుకు ఆ స్నేహితుడు ‘లేదు, ఎవరో అంటుండగా విన్నాను’అని సమాధానం ఇచ్చాడు.
‘అంటే నీవు చెప్పబోయే విషయం నిజమైనదే అని నీకు తెలీదన్న మాట’ అని చాణక్యుడు తేల్చేశాడు. సరే..

రెండవ జల్లెడ: ‘నీవు నాకు చెప్పబోయే విషయం నా మిత్రుడి గురించిన మంచి విషయమా’ అని అడిగాడు చాణక్యుడు.
కాదు అన్నాడు విషయం మోసుకొచ్చిన వ్యక్తి.
అంటే నీవు నా మిత్రుడి గురంచి చెడు చెప్పాలనుకున్నావు. అది కూడా నీకు ఖచ్చితంగా నిజం తెలియకుండా.. అని తేల్చిన చాణక్యుడు సరే..

మూడో జల్లెడ: ‘ఉపయోగం’ నీవు నా మిత్రుడి గురించి చెప్పబోయే విషయం నాకు ఉపయోగమైందా? అని చాణక్యుడు అడిగాడు.
లేదు అన్నాడు మళ్లీ ఆ మిత్రుడు.
అయితే నీవు చెప్పబోయే విషయం నిజమైనది, మంచిది, ఉపయోగకరమైంది కానప్పుడు నాకు చెప్పడం ఎందుకు అని అన్నాడు చాణక్యుడు.

నీతి: మన గురించి, మన వాళ్ల గురించి చెడు వార్తలను, విషయాలను మోసే వాళ్లు చాలా మందే ఉంటారు. ఒక విషయం (చాడి) వినే ముందు ఈ మూడు జల్లెడల పద్ధతి అనుసరిస్తే, మన బంధాలు నిలబతాయి, మంచి పెంపొందుతుంది. చాడీలు నివారించబడతాయి.

దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి